20, జనవరి 2010, బుధవారం

రీడ్‌ మరాఠీ... రైట్‌ మరాఠీ...! తెలుగు వ్యుత్పత్తి పదకోశాలు

ట్యాక్సీ డ్రైవర్‌ కావాలంటే తప్పనిసరి.ఇకపై ముంబైలో ట్యాక్సీ నడపాలంటే ముఖ్యంగా మూడు అర్హతలు ఉండాలి. ఒకటి... మరాఠీ మాట్లాడటం. రెండు... మరాఠీ చదవడం, రాయడం. మూ డు... కనీసం 15 సంవత్సరాలుగా స్థానికులై ఉండటం.ఈ అర్హతలు ఉంటేనే ట్యాక్సీ పర్మిట్‌ జారీ చేస్తారు.సీఎం అశోక్‌ చవాన్‌ నేతృత్వంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ముంబైలోని 'వలస' రాజకీయాలను కొత్త మలుపు తిప్పనుంది.నగరంలో సుమారు 2 లక్షలకు పైగా ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు.(ఆంధ్రజ్యోతి21.1.2010)

మనరాజధాని నగరంలో కూడా ఇలా చేస్తే బాగుండును.తెలుగు మీడియంలో చదువుకున్నవారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి.తెలుగులో చదవండి,తెలుగులో వ్రాయండి.
అవును మరి. తెలుగు ని ఆంగ్లం లో మాట్లాడే ఈ నాటి యువత కూడా అస్సలుతెలుగుని తెలుగులో నే మాట్లాడాలని కూడా చెప్పాలి. అమ్మని అమ్మా అని, నాన్నని నాన్న , నాన్నగారు ,బాపూ అని పిలవాలని ఎవరూ చెప్పక్కర్లేదనుకుంటా. ముందు తెలుగు లో మాట్లాడడానికి సిగ్గుపడ్డం మానేయాలి. మన భాష ని ఎక్కడ ఉన్నా ప్రేమించి మాట్లాడ్డం నేర్చుకోవాలి. మనల్ని మనమే గౌరవిన్చుకోకుండా ఎవరో చులకన చేసారని భావించడం సబబా / తెలుగు మాట్లాడదాం /తెలుగులో పలకరించుకుందాం /తెలుగు భాషకి జీవం పోద్దాం