26, మే 2009, మంగళవారం
నిప్పుతో తస్మాత్ జాగ్రత్త
నిప్పు నిజం లాంటిది. అవుని... మీరు చదివింది కరెక్టే..! నిజం నిప్పు లాంటిది అయినప్పుడు నిజం లాంటిది అని కూడా అనొచ్చు కదా..! నిజం నిప్పులాంటిది కబట్టే అది అబద్ధాలను కాల్చేస్తుంది..! అగ్నికీ, అబ్ద్ధానికీ పడదు. అది ఆదినించీ ఉన్నదే! దీపం మీద ప్రమాణం చేసి చెబితే అది నిజమని నమ్మే జనం ఉన్నారు. మనదేశంలో కోంతమంది దీపం ఆర్పి చెబుతామని అంటారు. బహుశా దీపంతో పాటు నిజాన్ని కూడా ఆర్పేయాలన్న అంతరార్థంతో కాబోలు..! నిక్కచ్చితనం నిరూపించుకోవడానికి నిప్పుల్లో దూకుతానని చెప్పేవాళ్లున్నారు. రామాయణంలో రాముడు సీత చేత అగ్నిప్రవేశం చేయించాడు. సీత పతివ్రతగా, పునీతగా ప్రసిద్ధి కెక్కింది అప్పుడే! మరి రాముడు. అలాంటి నిరూపణ్కు ఎందుకు పూనుకోలేదని ప్రశ్నించవు మన పురాణాలు, కావ్యాలు, అది వేరే సంగతి. జాతీయోద్యమంలో విదేశీ వస్త్ర దహనం గొప్ప దేశభక్తికి నిదర్శనం. ఊరూరా అది పెద్ద ఉద్యమంలా సాగింది. ఇక దిష్టిబొమ్మలను మంటల్లో తగలేయడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ వరసలో చూసినప్పుడు నిరసన ప్రదర్శించటానికీ, నిజాన్ని నిరూపించుకోవటానికీ నిప్పుకు మించిన సాధనం మరొకటి లేనేలేదని చెప్పొచ్చు. తప్పుకూ నిప్పుకూ ఏమాత్రం పొసగదు. కర్ర వంకర పొయ్యి తీరుస్తుంది అంటారు. దీని పరమార్ధం కూడా ఇదేనేమో! తప్పుల్ని, వంకల్ని సరిచేయడంలో నిప్పుకు మించిన నిపుణ ఇంకొకటి లేదు. అందుకే కాబోలూ; అధికారం ఉంటుందో ఊడుతుందో తెలీని సంధికాలంలో ఫైళ్లదహనం పరమ సహజంగా చోటు చేసుకుంటుందని కొందరికి అనుమానం. మరికొందరికి నమ్మకం నిప్పుకు కొంత గ్లామర్ కూడా ఉంది. అగ్గి రాముడు, అగ్గి బరాటా గట్రా.
20, మే 2009, బుధవారం
17, మే 2009, ఆదివారం
15, మే 2009, శుక్రవారం
14, మే 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)














